ప్రారంభమైన బతుకమ్మ పండుగ వేడుకలు

10-10-2026 | 10:14pm

ఆడి పాడిన మహిళలు

ఘట్ కేసర్,(విజయక్రాంతి) : చిత్తూ చిత్తుల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్ము ఈ వాడలోనా అంటూ బతుకమ్మ పాటలతో ఘట్ కేసర్(Ghatkesar) సర్కిల్ ప్రాంతంలోని వాడలు హోరెత్తాయి. తెలంగాణ సంస్కృతి సాంద్రాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండగ  శనివారం ఎంగిలిపూల బతుకమ్మ(Engilipoola Bathukamma)తో ప్రారంభమైనది. అమావాస్య నుంచి 9 రోజుల పాటు కొనసాగే ఈపండగ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. మహిళలు, యువతులు ఎంతో ఇష్టంగా పూల పండగ బతుకమ్మ వేడుకలో పాల్గొంటారు.

ఆడపడుచులు ప్రకృతిలో లభించే రకరకాల పూలను బతుకమ్మగా పేర్చి ఆటపాటలతో పూజించి దగ్గరలోని చెరువులలో నిమజ్జనం చేస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మలో మహిళలు, యువతులు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయె చందమామ వంటి సాంప్ర దాయ గీతాలు ఆలపిస్తూ ఆటపాటలతో సంబురంగా జరుపుకున్నారు.

మరిన్ని వార్తలు