అన్నోజీగూడ ఫ్లైఓవర్ పై కారులో మంటలు
నలుగురు ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది
ఘట్ కేసర్,(విజయక్రాంతి): పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్(Pocharam IT Corridor Police Station) పరిధిలోని అన్నోజీగూడ ఫ్లైఓవర్(Annajiguda Flyover)పై ఓ రెనాల్ట్ పెట్రోల్ కారు(Renault petrol car) మంటల్లో చిక్కుకుంది. వరంగల్ ప్రాంతానికి చెందిన వారని సమాచారం. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలు, అందులో ప్రయాణిస్తున్న వారి సురక్షితం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.