ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు ప్రక్రియ
ఘట్ కేసర్, నవంబర్ 5 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Enumula Revanth Reddy) సూచనలు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్(Mahesh Kumar), జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదేశాల మేరకు పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్ నేతృత్వంలో ఘట్కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో, పోచారం డివిజన్ చౌదరిగూడ గ్రామ శాఖ అధ్యక్షుడు మంచాల సుధాకర్ అధ్యక్షతన శుక్రవారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి(MLC Graduate Candidate) శ్యామ రామ్మోహన్ రెడ్డికి(Shyama Rammohan Reddy) మద్దతుగా ఓటర్ నమోదు కార్యక్రమం(Voter Registration Program) నిర్వహించడం జరిగింది.
ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు ప్రక్రియకు చివరి రోజు కావడంతో అర్హులైన పట్టభద్రులు ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని కాలనీ వాసులకు, విద్యావంతులకు అవగాహన కల్పిస్తూ ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరడం జరిగింది.
ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యామ రామ్మోహన్ రెడ్డి పట్టభద్రులు, విద్యావంతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పోచారండివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ భోజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పులికంటి భాస్కర్ రెడ్డి, బండ్లగూడ నాగేష్ గౌడ్, పోచారం డివిజన్ ఎస్టీ సెల్ శ్రావణ్ నాయక్ కళ్యాణ్ నాయక్, కాలనీవాసులు నాగరాజు, భద్ర, రఘు, తులసి తదితరులు పాల్గొన్నారు.