ముదిగొండ శివప్రసాద్ సంస్మరణ సభ
మేడ్చల్ అర్బన్ అక్టోబర్ 25(విజయక్రాంతి): చరిత్రాత్మక నవలా చక్రవర్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి,అపార దేశభక్తి సంపన్నులు, ఆచార్య వర్యులు, కీర్తిశేషులు డాక్టర్ ముదిగొండ శివప్రసాద్(Dr. Mudigonda Shiva Prasad) సంస్మరణ సభ(Memorial Meeting) ఆదివారం మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ(Medchal District Library Organization) ఆవరణలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీ వేత్త పడాల రఘురాం పటేల్,డిసి నరసింహులు,లాయ ర్ రాధాకృష్ణ. గ్రంథాలయ స్టాఫ్ ప్రవల్లిక, విద్యార్థిని విద్యార్థులు(Students) వివిధ పాఠకులు పుర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆచార్య శివప్రసాద్ కు శ్రద్ధాంజలి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆచార్య ముదిగొండ శివప్రసాద్ సాహితీ,విద్యా రంగానికి,చేసిన విశేష సేవలను గుర్తు చేసుకున్నారు.ఆచార్య శివప్రసాద్ సంస్మరణ సభకు సహకరించిన జిల్లా గ్రంథాలయ ఇంచార్జీతో పాటు సిబ్బందికి పడాల రఘురాం పటేల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.