పల్లెకు కొత్త కళ.. ప్రజలకు వారపు సంత సందడి.!

02-11-2026 | 09:55pm

లాల్ తండాలో ప్రతి సోమవారం నిర్వహణ

స్థానికంగానే కొనుగోళ్లు, అమ్మకాలు

మాజీ జెడ్పిటిసి బానోతు మాతృనాయక్, సర్పంచ్ తేజావత్ ఆండాలు చొరవతో అందుబాటులోకి కొత్త సౌకర్యం

మోతె,(విజయక్రాంతి): గ్రామంలోనే నిత్యావసర సరుకులు లభిస్తే.. కొనుగోళ్లకు దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు తప్పితే.. ఆ సౌకర్యం గ్రామీణులకు ఎంతో మేలు చేస్తుంది. ఇదే ఆలోచనతో సూర్యాపేట జిల్లా(Suryapet district) మోతె మండలం లాల్ తండా గ్రామంలో నూతన వారపు సంతకు శ్రీకారం చుట్టారు. మాజీ జెడ్పిటిసి బానోతు మాతృనాయక్(ZPTC Banothu Matrunayak), గ్రామ సర్పంచ్ తేజావత్ ఆండాలు,  సోమవారం సంతను ప్రారంభించారు.

ప్రతి సోమవారం సంత సందడి

ఇకపై ప్రతి సోమవారం లాల్ తండాలో వారపు సంత నిర్వహించనున్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు ఒకేచోట అందుబాటులోకి రానున్నాయి. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇక్కడే కొనుగోళ్లు, అమ్మకాలు చేసుకునే అవకాశం కలగనుంది.

వ్యాపారులకు ఉపాధి.. గ్రామానికి ప్రయోజనం

వారపు సంత ఏర్పాటు స్థానిక వ్యాపారులకు కొత్త అవకాశాలను కల్పించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీలు పెరిగి స్థానిక ఆర్థిక కార్యకలాపాలకు దోహదపడనుంది. గ్రామంలోనే సంత అందుబాటులోకి రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సౌకర్యం కల్పించిన మాజీ జెడ్పిటిసి మాతృనాయక్, సర్పంచ్ తేజావత్ ఆండాలుకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బానోతు సాలమ్మ సైదులు, మాజీ సర్పంచ్ భద్రమ్మ బాలాజీ, కీలుగాని వెంకన్న, బానోతు శీను (పంతులు) ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు