మనువాదాన్ని ప్రతిఘటించిన మార్క్సిస్టు మేధావి సీతారాం ఏచూరి
12-09-2026 | 11:46pm
సిపిఎం మండల కార్యదర్శి ఎన్. సబిత
ఘట్ కేసర్,(విజయక్రాంతి): మనువాదాన్ని ప్రతిఘటించిన మార్క్సిస్టు మేధావి సీతారాం ఏచూరి అని మండల కార్యదర్శి ఎన్ సబిత(CPM Mandal Secretary N. Sabitha) అన్నారు. శనివారం సీపీఎం ఘట్ కేసర్ మండల కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సీతారాం ఏచూరి(Former MP Sitaram Yechury) ద్వితీయ వర్ధంతి సందర్భంగా సిపిఎం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి విప్లవ భావాలవైపు ఆకర్షితుడైన సీతారాం ఏచూరి తుది శ్వాస వరకు నిబద్ధత కలిగిన మార్క్సిస్టుగా దేశంలో కార్మిక వర్గ పక్షపాతిగా నిలిచాడని పేర్కొన్నారు.