ఫోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..
జవహర్ నగర్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫోక్సో కేసు(POCSO Case)లో నిందితునికి మూడు ఏళ్ల జైలు శిక్ష రెండు వేల జరిమానా విధించిన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోక్సో చట్టం 2012 సెక్షన్ 8 కింద నిందితుడు కలశెట్టి దినేష్ కుమార్ ( 20) ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ సంతోష్ నగర్ లో నివసిస్తున్నాడు. ఈ మేరకు బుధవారం మేడ్చల్ జిల్లా ఫోక్సో జడ్జి సత్వర విచారణ నిమిత్తం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జి ఐపిసి సెక్షన్ 448 కింద 1000 రూపాయల జరిమానా సెక్షన్ 354 కింద 1000 రూపాయల జరిమానా మొత్తం మూడు ఏళ్ల జైలు శిక్ష రెండువేల జరిమానా విధిస్తూ నిందితుడికి మూడేళ్ల కారాగార శిక్ష విధించారు.