ప్రజా ప్రభుత్వంలో.. అభివృద్ధి పనులు ముందంజలో
జవహర్ నగర్ లోని డివిజన్ల అభివృద్ధి యే ధ్యేయం.
చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్.
జవహర్ నగర్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతం... అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదని, చంద్రపురి కాలనీ డివిజన్ అభివృద్ధియే ధ్యేయంగా చేస్తున్నామని చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేష్ పూల శ్రీకాంత్ యాదవ్ పేర్కొన్నారు.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ చంద్రపురి కాలనీ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో, కాలనీ అభివృద్ధిలో భాగంగా మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ తదితర పార్టీ శ్రేణులతో కలిసి బుధవారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీ పథకాలతో తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుంది అనడంలో సందేహం లేదన్నారు. సంక్షేమ పాలనలో రాష్ట్రం ఎనలేని ప్రగతిని సాధించడం తెలంగాణకే గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొడుగు వేణు, ఉపాధ్యక్షులు చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి సామాజిక సేవకులు బూడిద వెంకటేష్, జోగి సునీత, రజిత గోపాల్, నర్ర మహేష్, భాస్కర్ గౌడ్, ఎస్ సి సెల్ అధ్యక్షుడు రాహుల్ కదం, మైనారిటీ అధ్యక్షులు ఎండి గౌస్, స్థానికులు బషీర్, షఫీ, శ్రీరామ్, నాగరాజు, స్రవంతి, స్వామి గౌడ్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.