ఘట్ కేసర్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా తోక మల్లేష్
ఘట్ కేసర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఘట్ కేసర్ డివిజన్ అధ్యక్షులుగా తోక మల్లేష్(Congress Ghatkesar President Thoka Mallesh) నియమితులయ్యారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కావలి చంద్రయ్య(Medchal District SC Cell Chairman Kavali Chandraiah) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఘట్ కేసర్ పట్టణానికి చెందిన తోక మల్లేష్ కాంగ్రెస్ నాయకుడిగా పార్టీ బలోపేతానికి అలాగే బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని గుర్తించి డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా నియమించడం జరిగిందని జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కావలి చంద్రయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా తోక మల్లేష్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం నాపై పెట్టిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఘట్ కేసర్ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు.