పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర వ్యక్తి హల్చల్
పవన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. బిల్డర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు!
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) నివాసం వద్ద ఓ బిల్డర్ కత్తితో హల్చల్ చేయడం కలకలం రేపింది. అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తనకు పవన్ కల్యాణ్ Financial Help చేయాలని కోరుతూ నిరసనకు దిగాడు. ఈ క్రమంలో బౌన్సర్లపై కత్తితో దాడికి యత్నించడమే కాకుండా, తనను తాను గాయపరుచుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఖమ్మం జిల్లాకు చెందిన బిల్డర్ సుచేతన్ ఠాకూర్ నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా(Khammam District) బల్లేపల్లికి చెందిన బట్టు సుచేతన్ ఠాకూర్ నాయక్ వృత్తిరీత్యా Builder. అప్పుల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన, తన సమస్యను పవన్ కల్యాణ్‌కు వివరించి సాయం పొందాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా గత 16 రోజులుగా పవన్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ నెల 18న జూబ్లీహిల్స్‌లోని పవన్ నివాసం వద్దకు చేరుకుని, తన అప్పులు తీర్చేందుకు ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఓ Flexi ప్రదర్శిస్తూ నిరసన తెలిపాడు. తనకు సాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు.
అక్కడ Security Dutyలో ఉన్న బౌన్సర్లు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సుచేతన్ బౌన్సర్లపై కత్తితో దాడి చేసేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం తన వెంట తెచ్చుకున్న కత్తితో ఛాతీ, చేతులపై గాయాలు చేసుకుని Suicide Attemptకు పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన బౌన్సర్లు అతడి నుంచి కత్తిని లాక్కొని పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సుచేతన్ను అదుపులోకి తీసుకున్నారు. బౌన్సర్ రాంశెట్టి రాజీవ్ కుమార్ ఇచ్చిన Complaint మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పవన్ కల్యాణ్ నివాసం వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.