అయ్యప్ప భక్తులకు తీపి కబురు

20-11-2026 | 02:15pm

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. రోజుకు మరో 5 వేల మందికి అవకాశం

శబరిమల యాత్రికులకు ఊరట.. రోజూ అదనపు దర్శన స్లాట్లు!

కేరళ: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (TDB) తీపి కబురు అందించింది. మండల-మకరవిళక్కు యాత్రా సీజన్‌లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు దర్శన సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ 30 వరకు ప్రతిరోజూ మరో 5,000 మంది యాత్రికులకు Virtual Queue విధానంలో దర్శనం చేసుకునే అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న మండల-మకరవిళక్కు సీజన్‌లో శబరిమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మందికి అయ్యప్ప దర్శనం కల్పించేందుకు బోర్డు అదనపు Virtual Queue Booking Slots అందుబాటులోకి తీసుకురానుంది. నవంబర్ 30 వరకు ప్రతిరోజూ ఈ అదనపు బుకింగ్ సదుపాయం కొనసాగనుంది. ఇప్పటికే తమకు కావాల్సిన తేదీల్లో ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోలేకపోయిన భక్తులకు ఈ నిర్ణయం కొంత ఊరటనివ్వనుంది. ముఖ్యంగా ముందస్తు ప్లానింగ్ చేసుకున్నా స్లాట్లు దొరకని యాత్రికులు ఈ అదనపు అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

నవంబర్ 21, 22 తేదీల్లో స్పాట్ బుకింగ్ పెంపు

మరోవైపు నవంబర్ 21, 22 తేదీల్లో Spot Booking సదుపాయాలను కూడా పెంచాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించింది. వర్చువల్ క్యూ లేదా స్పాట్ బుకింగ్‌లో కోరుకున్న తేదీలకు స్లాట్లు పొందలేని భక్తులకు ఈ ఏర్పాట్లు ఉపయోగపడనున్నాయి. అదనపు స్లాట్లు అందుబాటులోకి వచ్చినప్పుడు భక్తులు తమకు అనుకూలమైన అవకాశాన్ని ఎంచుకోవాలని బోర్డు సూచించింది. శబరిమల యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న అయ్యప్ప భక్తులు ఈ తాజా Booking Updateను గమనించి, అందుబాటులో ఉన్న స్లాట్లను వినియోగించుకోవాలని కోరింది.

మరిన్ని వార్తలు