రెండున్నర దశాబ్దాల నిరీక్షణకు తెర

06-11-2026 | 12:26pm

ఉప్పల్, నవంబర్ 6 (విజయక్రాంతి): విద్యార్థుల భద్రతకు ముప్పుగా మారిన రెండు దశాబ్దాల విద్యుత్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. నాచారం పాత గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ద్వారం పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను విద్యుత్ శాఖ అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీంతో పాఠశాలలో చదువుతున్న సుమారు 250 మంది విద్యార్థులకు ప్రమాదం తప్పింది.

పాఠశాల ప్రవేశ ద్వారం పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి తరచూ శబ్దాలు, విద్యుత్ మెరుపులు, మంటలు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందేవారు. ఈ సమస్యను సీనియర్ జర్నలిస్టు సురేష్ ఇడపాక విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన విద్యుత్ శాఖ ఎస్‌ఈ పి. వెంకన్న ప్రత్యేక చొరవ తీసుకుని ట్రాన్స్‌ఫార్మర్ తరలింపునకు (Transformer Relocation) చర్యలు చేపట్టారు.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించి విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించిన విద్యుత్ శాఖ అధికారులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన సీనియర్ జర్నలిస్టు సురేష్ ఇడపాకను సైతం పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో సీఈ పి.వి. రమేష్, ఎస్‌ఈ పి. వెంకన్న, డీఈ కె. సుబ్బారావు, ఏడీఈ కె. శ్రీనివాస్, ఏఈ బి. నాగరాజు, ఎస్‌ఎల్‌ఐ సి. ప్రతాప్ రెడ్డి, ఎల్‌ఐ జమీల్, ప్రధానోపాధ్యాయులు చినబాబు దుప్పట్ల, నందీశ్వర్, శైలజ, అనురాధ, విజయలక్ష్మి, సుగుణవతి, సామాజిక కార్యకర్త మోతే సురేష్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు కోరపాక అంజి మాదిగ, టీఎస్‌ఎస్‌డబ్ల్యూజేఏ ఉత్సవ కమిటీ చైర్మన్ ఏళ్ల సంతోష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నెమ్మది వెంకన్న, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దత్రపు దేవా, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు