అర్ధరాత్రి హైవేపై టైర్ బ్లాస్ట్

06-11-2026 | 10:12am

టైర్‌ పేలడంతో డివైడర్‌ను ఢీకొన్న ప్రైవేట్‌ బస్సు

ఒకరికి స్వల్ప అస్వస్థత.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

అలంపూర్, విజయక్రాంతి, నవంబర్ 06; ఏపీ ప్రొద్దుటూరునుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు వెళ్తున్న పీఆర్ఎల్ ప్రైవేట్‌ ట్రావెల్స్‌(PRL Private Travels) బస్సు గురువారం అర్ధరాత్రి 1.40 గంటలకు అలంపూర్‌ చౌరస్తా సమీపంలోని ఎన్‌హెచ్‌-44 ఫ్లైఓవర్‌పై టైర్‌ పేలడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో పొద్దుటూరుకు చెందిన లక్ష్మీదేవి (60) ఛాతీ నొప్పితో బాధపడటంతో ఉండవెల్లి 108 అంబులెన్స్‌ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి అలంపూర్‌ 100 పడకల ఆస్పత్రికి తరలించారు. బస్సులోని మిగతా ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు