నా జుట్టులో ఏవేవో దాచేవారు!

26-10-2026 | 05:25am

అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన రింగుల జుట్టు గురించి, చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఒకప్పుడు తనే ఎంతో అసహ్యించుకున్న తన రింగుల జుట్టే, ఇప్పుడు తన అసలైన గుర్తింపుగా మారిందని సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల రోజుల్లో తన రింగుల జుట్టు కారణంగా స్నేహితులు ఎగతాళి చేసేవారని గుర్తుచేసుకున్నారు.

తన జుట్టులో చిత్తు కాగితపు ముక్కలు, పెన్ క్యాప్లు, చాక్ పీసులు, చాక్లెట్ కవర్లు, చివరికి ఎండిపోయిన గడ్డిని కూడా ముడిచేవారని ఆవేదన వ్యక్తం చేశారు. తన జుట్టును చూసి అందరూ వైకోలు కూన, తేనెతుట్టె, అడవి అంటూ వెక్కిరించేవారని చెప్పారు. తన తల్లి దగ్గరకు వెళ్లి జుట్టును వీలైనంత గట్టిగా జడ వేయమని అడిగేదాన్ని అని, ఎప్పుడూ జుట్టును విరబోసుకునేదాన్ని కాదనారు.

కేవలం సిల్కీగా, స్ట్రెయిట్గా ఉండే జుట్టు మాత్రమే అందమైనదనే భ్రమను సమాజం తనలో కల్పించిందని, అందుకే చిన్నప్పుడు తన జుట్టును తాను అసహ్యించుకున్నానన్నారు. దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమమ్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని అనుపమ తెలిపారు. 

మరిన్ని వార్తలు