‘హైందవ’ టీజర్ అదుర్స్
నడవలేని విగ్రహాలు నడిపించే కథే హైందవ
బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas) హీరోగా నటిస్తున్న సినిమా ‘హైందవ(haindava)’. లుధీర్ బైరెడ్డి దర్శక త్వంలో మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేశ్ చందు నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్(Samyuktha Menon) కథానాయిక కాగా.. మహేశ్ మంజ్రేకర్, సౌరభ్ సచ్‌దేవా, జేడీ చక్రవర్తి, శివాజీ రాజా, గెటప్ శ్రీను ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను(Movie Teaser) బుధవారం లాంచ్ చేశారు. ఈ చిత్రాన్ని నవంబర్ 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్(Mystery Thriller).
చాలా అద్భుతమైన కథ. ఇప్పుడున్న సమయంలో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు చాలా ముఖ్యం. మా సినిమా కూడా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇంత అద్భుతమైన కథ ఇచ్చినందుకు లుదీర్కు థాంక్యూ. సంయుక్త ఒక సినిమాలో వుందంటే అది బ్లాక్‌బస్టర్ (నవ్వుతూ). మా టీమ్ అందరికీ ధన్యవాదాలు” అన్నారు. హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ.. “డైరెక్టర్ లుదీర్ చాలా మంచి నరేటర్. ఆయన చెప్పిన కథ వినగానే వెంటనే ఓకే చేశా. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది.
నిర్మాత, మా హీరో చాలా మంచి ఫ్రెండ్స్. దానివల్ల సెట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉండేది” అని చెప్పింది. డైరెక్టర్ లుధీర్ బైరెడ్డి మాట్లాడుతూ.. “దశావతారాల గుడి నేపథ్యంలో జరిగే కథ ఇది. నడవలేని విగ్రహాలు కథను నడిపిస్తాయి. దశావతారాల మీద సినిమా డైరెక్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. సేవ్ ది టెంపుల్స్, లెట్స్ ప్రొటెక్ట్ అవర్ కల్చర్. హైందవ” అన్నారు. ‘టీజర్ ఎంతగా ఆకట్టుకుందో, సినిమా అంతకంటే ఎక్కువగా ఆకట్టుకుంటుంద’ని నిర్మాత మహేశ్ చందు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ డిజైనర్ డీ కామేశ్ కూడా మాట్లాడారు. మూవీ టీమ్ పాల్గొన్నారు.