పెళ్లికి ముందే బేబిని కనాలని ఉంది!

16-10-2026 | 05:10am

నరేశ్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ కల్యాణం(Crazy Kalyanam)’. భద్రప్ప గాజుల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్‌పై బూసం జగన్‌మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ నెల 16న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఇంటర్వ్యూలో కథానాయిక అనుపమ పరమేశ్వరన్ విలేకరులతో పంచుకున్న ఈ మూవీ హైలైట్స్ ఆమె మాటల్లోనే..

ఇది వినోదాత్మకమైన, వోద్వేగభరితమైన సాగే కథ. నరేశ్, అఖిల్, తరుణ్ భాస్కర్(Tarun Bhascker).. ఇలా వీళ్లంతా కాస్టింగ్‌లో జాయిన్ అయ్యాక మరింత క్రేజీ ప్రాజెక్ట్ అయ్యింది. ఈ సినిమా కోసం నేను ఇంటెన్స్ ప్రమోషన్స్ చేశా. వ్యక్తిగతంగా ఆనందంగా ఉన్నా కాబట్టి అంత ఎంజాయ్ చేస్తూ ప్రమోషన్స్‌లో పాల్గొన్నా. జగన్ మోహన్‌రెడ్డి లాంటి క్రేజీ ప్రొడ్యూసర్ లేకుంటే ఈ సినిమా ఇంత బాగా మన ముందుకు వచ్చేది కాదు. 

ఈ సినిమాలో నాకు పెళ్లి అవుతుందా.. కాదా అనేది తెరపై చూడాలి. ఈ సినిమాలోలా మా ఇంట్లో నా పెళ్లి గురించి ఏమాత్రం ఒత్తిడి లేదు. నీకు ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే మా వాళ్లు అంటారు. నాకైతే పెళ్లికి ముందే ఒక బేబిని కనాలని ఉంది. అది ఏ పద్ధతి లోనైనా అయి ఉండొచ్చు! మా కేరళ వివాహా వేడుకల్లో పూర్తిగా శాకాహారమే వడ్డిస్తారు. కానీ తెలంగాణ పెళ్లి వేడుకల్లో ఉండే కొత్త సంప్రదాయం తెలుసుకున్నా. మా కేరళలో ఇప్పుడు పెళ్లి వేడుకల్లో హల్దీ, మెహందీ అని కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి. కానీ, గతంలో ఎంగేజ్‌మెంట్, పెళ్లి ఈ రెండే వేడుకలు జరిపేవారు.

‘క్రేజీ కల్యాణం’ సినిమాలో మా పాత్రలన్నీ పడే కష్టాలు ప్రేక్షకులకు కామెడీగా అనిపిస్తాయి. మా పాత్రల ద్వారా, ఆ సందర్భాల ద్వారా సహజమైన హాస్యం పుడుతుంది. స్క్రిప్ట్‌తోపాటు దర్శకుడిగా భద్రప్ప నిజాయితీతో కూడిన విధానం నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నా. మా సినిమాలో తరుణ్ భాస్కర్ చేసిన బాలరాజు పాత్ర మనలో ఒకడు, మన రోజువారీ జీవితంలో నుంచి వచ్చిన పాత్ర అది. ఆ క్యారెక్టర్‌లో చాలా ఫన్ ఉంటుంది. మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా కొంతవరకు బాలరాజులే! 

పెళ్లి అనేది ఇద్దరు కలిసి సంతోషంగా జీవించడానికి చేసుకునేది. కానీ అమ్మాయిని ఇంట్లో పనిమనిషిని చేసేందుకు కాదనేది నా క్యారెక్టర్ కీర్తి ఉద్దేశం. వ్యక్తిగతంగా నా అభిప్రాయమూ అదే. అందుకే ట్రైలర్‌లో నేను వంట చేస్తే నువ్వు గిన్నెలు కడగాలి అనే డైలాగ్ పెట్టాం. అఖిల్ నటనలో ఎమోషనల్ హానెస్టీ ఉంటుంది, ఎమోషన్స్ ఆర్టిఫిషల్‌గా అనిపించవు. కళ్లలో స్పార్క్ ఉంటుంది. ఆ క్వాలిటీస్ అన్నీ ఉదయ్ క్యారెక్టర్‌కు కావాలి. కీర్తి స్ట్రిక్ట్ క్యారెక్టర్. ఆ పాత్రకు బ్యాలెన్స్ చేస్తూ సపోర్టివ్‌గా ఉంటాడు ఉదయ్. ఈ కథలో కాన్‌ఫ్లిక్ట్ కూడా అదే. ఇన్ని పాత్రల మధ్య ఉదయ్ వ్యక్తిత్వం తెలియాలంటే నటుడిగా అఖిల్‌లో ఒక ఎమోషనల్ హానెస్టీ కావాలి. అలాంటి పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు అఖిల్.

కొన్ని ప్రాజెక్టుల్లో మనం చెప్పేందుకు ఏమీ ఉండదు. వాళ్లు ఇచ్చిన క్యారెక్టర్ చేసుకుని వెళ్లిపోతాం. కానీ క్రేజీ కల్యాణం లాంటి సినిమాలకు నా అభిప్రాయాలు చెప్పి, మాట్లాడుకుని చేసే స్పేస్ ఉంది. డైరెక్టర్ భద్రప్పతో నాకు అనిపించిన ఆలోచనలు షేర్ చేసుకున్నా. నరేశ్, అఖిల్, తరుణ్.. ఇలా మేమంతా కలిసి డిస్కస్ చేసుకుని నటించాం. సీన్స్ మరింత బెటర్‌గా వచ్చేందుకే ఈ ప్రయత్నమంతా చేశాం. ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడా. యాస కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్స్ చేయలేదు గానీ డైరెక్టర్ చెప్పేదాన్ని గమనిస్తూ డైలాగ్స్ చెప్పా.

నటిగా నేనెప్పుడూ విభిన్నంగా ఉండాలని ప్రయత్నిస్తుంటా. నా సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయని ప్రేక్షకులు అనుకోకూడదు. నా క్యారెక్టర్ చూసే సినిమా పేరు చెప్పాలి. అంత ప్రత్యేకంగా సినిమాలు ఉండేలా ఎంపిక చేసుకుంటా. ‘క్రేజీ కల్యాణం’లో కీర్తి పాత్ర కూడా అలా ప్రత్యేకంగా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. డబ్బుల కోసం నటించాలనుకోను. ఏదో కొత్తగా ప్రయత్నించాలనే ప్యాషన్ నన్ను నడిపించాలి. ప్రస్తుతం తమిళంలో, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తున్నాను. అవన్నీ పూర్తిగా దేనికది భిన్నమైన చిత్రాలు. 

మరిన్ని వార్తలు