జెన్యూన్ రివ్యూ ఇవ్వండి
రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి ‘డార్క్ చాక్లెట్’ చిత్రాన్ని(Dark Chocolate Film) అందిస్తోంది. విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శశాంక్ శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ కర్టెన్ రైజర్ ఈవెంట్‌ను మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో విశ్వదేవ్ మాట్లాడుతూ.. “ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా ఇది. మేము కచ్చితంగా ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం. రొటీన్ సినిమా కాదు. సినిమా అనే ఫార్మాట్‌కే ఛాలెంజ్ చేసేంత కొత్తగా శశాంక్ ఈ కథను రాశారు” అన్నారు. బిందు మాధవి మాట్లాడుతూ.. “డార్క్ చాక్లెట్’ చాలా కొత్త తరహా సినిమా. యూఎస్‌లో ముందుగానే రిలీజ్ అవుతుంది.
సినిమా చూసినవాళ్లు జెన్యూన్‌గా రివ్యూ ఇవ్వండి. మా కంటెంట్‌పై మాకు చాలా నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా” అన్నారు. డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. “ఇలాంటి సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలని సినిమా చూసిన చాలామంది అంటున్నారు. కాకపోతే ఈ కథ రాసినప్పుడు నాకు ఆ విషయం తెలియదు.
విశ్వదేవ్ తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఒక తెలుగు సినిమా మూడు రోజుల ముందే యూఎస్‌లో రిలీజ్ అవుతోంది. అందుకే ఈ కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. ఈ విషయంలో చాలా గర్వంగా ఉంది” అని తెలిపారు. డైరెక్టర్లు ఆదిత్య, మల్లిక్ రామ్, రవికాంత్ కూడా ఈ వేడుకలో మాట్లాడారు. సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.