హాయిగా నవ్వుకోవాలని తీసిన చిత్రమిది

11-10-2026 | 05:20am

శ్రీవిష్ణు నవ్వుల బ్లాక్‌బస్టర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’(Comrade Kalyan). జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పించగా, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. మహిమా నంబియార్(Mahima Nambiar) కథానాయికగా నటించారు. అక్టోబర్ 9న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “రెండు గంటల పాటు కడుపునిండా హాయిగా నవ్వుకోవాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. ఈ సినిమా చూసి ఒక పెద్ద హీరో కాల్ చేసి సినిమాని మెచ్చుకున్నారు. తర్వాతి ఈవెంట్స్‌లో ఆయన వస్తారు. ఆచార్య దళం డైలాగ్‌కు థియేటర్‌లో చాలా మంచి స్పందన వస్తోంది. కోన ఈ ఐడియా చెప్పినప్పుడే నేను చిరంజీవిని అడగమని సూచించా. ఆయనకు ఈ సీన్ గురించి చెప్పిన తర్వాత పగలబడి నవ్వారు.

సినిమా మొత్తానికి ఇదే హైలైట్ అవుతుందని ఆయన చెప్పినట్టుగానే ఆ సీన్‌కు వచ్చిన రియాక్షన్ చూస్తే అద్భుతంగా ఉంది” అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ.. “థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా, రైటర్‌గా ఉన్నా. నాకు ఎక్కువ సంతోషాన్నిచ్చింది రచయితగానే” అని తెలిపారు. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు