జేడీ చక్రవర్తికి ఉత్తమ నటుడి పురస్కారం

12-10-2026 | 05:20am

జేడీ చక్రవర్తి(JD Chakravarthy) నటించిన ‘దహిణి ది విచ్’ చిత్రానికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇప్పటికే ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్‌లో ఈ చిత్రం అనేక అవార్డులను కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 150 నామినేషన్స్ రాగా బెస్ట్ లీడ్ యాక్టర్ కేటగిరీలో జేడీ చక్రవర్తికి ఈ అవార్డ్ వచ్చింది. రాజేశ్ టచ్ రివర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జేడీ చక్రవర్తితోపాటు తనిష్ట ఛటర్జీ, శ్రుతి జయన్ కీలకపాత్రల్లో నటించారు.

సునీతా కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అవార్డు వచ్చిన సందర్భంగా జేడి చక్రవర్తి మాట్లాడుతూ.. ‘ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన హేమాహేమీలు రూపొందించిన చిత్రాలతో పోటీపడి ‘దహిణి’ ఉత్తమ చిత్రం అవార్డ్ దక్కించుకోవడం భారతీయ చలనచిత్ర పరిశ్రమకి గర్వ కారణం.

దాదాపు 150 నామినేషన్లలో వరల్డ్ వైడ్ నటులు ఉండగా, బెస్ట్ లీడ్ యాక్టర్ అవార్డ్ నన్ను వరించడం నన్నెంతో ఆనందానికి గురి చేసింది. ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. నార్వే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు తెలుపుతున్నా’ అన్నారు.

మరిన్ని వార్తలు