‘కిల్లర్’ను చూసి థ్రిల్ అవుతారు!

29-10-2026 | 05:10am

* జ్యోతి పూర్వజ్, పూర్వాజ్(Jyothi Poorvaj, Poorvaj), లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సెన్సేషనల్ సైఫై థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్(Killer)’. ఈ చిత్రంలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న థియేట్రికల్ రిలీజ్(Theatrical Release) రాబోతోంది. మంగళవారం జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్.

ఆ విశేషాలు మాటల్లోనే.. ‘కిల్లర్’ రిచ్ కంటెంట్ ఉన్న సినిమా. సెన్సార్ కార్యక్రమాలు(Censor formalities) కూడా పూర్తయ్యాయి. యూ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చూశాక సెన్సార్ వాళ్ల మొహాలు ఆహ్లాదకరంగా కనిపించాయి. అంటే మా మూవీ వారికి నచ్చిందని అనుకున్నాం. మా సినిమాలో బ్లడ్ షెడ్ లేదు. కథలో హింస ఉన్నా, అది పాత్రలు ఎదుర్కొనే దాంట్లో కనిపించాలి గానీ పాత్రలను చిత్రహింసలు పెట్టినట్లు చూపించడం నాకు నచ్చదు. వాంపైర్ పాత్రను కూడా అలాగే అందరు చూసేలా ట్రీట్ చేశాం. 

* మా సినిమా టీమ్‌లోని వారు మా కిల్లర్ మూవీని క్రిస్టోఫర్ నొలన్ ఒడిస్సీ సినిమాతో పోల్చారు. అది కొంచెం అతి అనిపించవచ్చు కానీ మా మూవీ చూసి బయటకు వచ్చాక ఒడిస్సీతో మీరే పోల్చుకుంటారు. మా సినిమాను ఒడిస్సీతో పోల్చడం ఒక స్పాయిలర్ కూడా. కొన్నేళ్ల కిందట నేను స్క్రూడ్ అనే కాన్సెప్ట్‌తో కథ రాసుకున్నాను. అది అప్పటికి నాకున్న రిసోర్సెస్‌కు రూపొందించడం కుదరలేదు. అదే స్క్రిప్ట్‌ను ఇప్పుడున్న ఆడియెన్స్ టేస్ట్‌కు తగినట్లు మార్పులు చేసి కిల్లర్ సినిమా రూపొందించాను. విజువల్‌గా ప్రేక్షకులు తెరపై చూసే ఏదైనా మంచి క్వాలిటీతో ఉండాలనేది మేకర్‌గా నా అభిప్రాయం. సినిమాకు కంప్లీట్ స్క్రిప్ట్ అయ్యాకే మిగతా వాటి గురించి ఆలోచిస్తా. ఇది ఫీమేల్ సెంట్రిక్ మూవీ.

* మా సినిమా సెకండాఫ్‌లో ట్విస్ట్ చెప్పినవారికి కోటి రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించాం. ఇది ప్రమోషనల్ స్టంట్ అనుకుంటారు. ఒక మనిషిని నమ్మడానికి కొన్నేళ్లు పడుతుంది. దీని మీద ఒక ప్రెస్‌మీట్ పెడుతున్నాం. హైకోర్టు లాయర్స్ కూడా అందులో పాల్గొంటారు. ఈ నెల 29న రాత్రి 10 గంటలకు మా మూవీ ప్రీమియర్స్ పడతాయి. 11 గంటలకు ఆ ట్విస్ట్ ఏంటనేది వాట్సాప్ చేయాలి. ఎవరు త్వరగా ఆన్సర్ పంపిస్తే వారి పేరు మా మూవీ సక్సెస్ మీట్‌లో ఎల్ ఈడీ స్క్రీన్ మీద డిస్ ప్లే చేస్తాం.

మా సినిమాకు ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని చెప్పాను. కానీ పదీ పదిహేను కోట్లు అని కూడా చెప్పొచ్చు. విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ అంత రిచ్‌గా ఉన్నాయి. మేము చెప్పినదానికంటే ఇంకా కొన్ని లక్షలు ఎక్కువే బడ్జెట్ అయ్యింది. మేము కోటి రూపాయల గిఫ్ట్ అనౌన్స్ చేయడం జనాల్లోకి విపరీ తంగా వెళ్లిపోయింది. మా సినిమా స్టోరీ చెబుతూ నాకు ఇన్ స్టాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే అంత ఈజీగా క్లూ అందదు.

మరిన్ని వార్తలు