డిప్యూటీ తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరణ

12-11-2026 | 06:49pm

డిప్యూటీ తహసిల్దార్ గా టీ నేతాజీ.  

వెంకటాపురం, నూగూరు, నవంబరు 12 ,విజయ క్రాంతి: వెంకటాపురం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో(Tahsildar Office) గురువారం డిప్యూటీ తాసిల్దార్ గా టీ నేతాజీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏటూరు నాగారం మండలం  కేంద్రంలో డిప్యూటీ తాసిల్దారుగా విధులు నిర్వహించి ప్రభుత్వం బదిలీ పై వెంకటాపురం మండలానికి పంపించడం జరిగిందన్నారు.

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని ప్రజాప్రతినిధులు, అధికారులకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.

మరిన్ని వార్తలు