రెట్రో స్టైల్.. బోల్డ్ మేకోవర్..

11-10-2026 | 05:25am

నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) తన నెకస్ట్ భారీ ఎంటర్‌టైనర్ ‘బ్లడీ రోమియో’(Bloody Romeo)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఓజీ’ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న తొలి సినిమా ఇదే. డార్క్ హ్యూమర్, ఎక్సయిటింగ్ యాక్షన్, విలక్షణమైన పాత్రలతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.

వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్, యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం నాని తన సరికొత్త లుక్‌ను పరిచయం చేశారు. మేకోవర్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేస్తూ, తన ప్రత్యేకమైన స్క్రీన్ పర్సనాలిటీని తీర్చిదిద్దడం వెనుక జరిగిన కృషిని ప్రజెంట్ చేశారు. ఇంతవరకు ప్రేక్షకులకు పరిచయమైన తన లుక్ భిన్నంగా, ఈసారి నాని రెట్రో స్టైల్లో బోల్డ్ మేకోవర్‌తో కనిపిస్తున్నారు.

సినిమా కథకు, పాత్ర స్వభావానికి తగ్గట్టుగా ఈ లుక్‌ను రూపొందించారు. ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ నాని మేకోవర్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. కర్లీ ముల్లెట్ హెయిర్ స్టుల్, టెక్చర్డ్ లేయర్స్‌తోపాటు రఫ్‌గా కనిపించే ఫుల్ బియర్డ్‌తో నానికి సరికొత్త లుక్‌లో  కనిపించారు. డిఫరెంట్ హెయిర్ స్టుల్ నానికి రెబల్ లుక్‌ను తీసుకొచ్చింది. ఆయన పోషిస్తున్న పాత్రకు ప్రత్యేకమైన యాటిట్యూడ్, పర్సనాలిటీ ఉన్నాయనే ఆసక్తిని ఈ లుక్ కలిగిస్తోంది.

తన హీరోలను స్టైలిష్‌గా చూపించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుజీత్.. ఆలీమ్ హకీమ్ సెలూన్‌లో జరిగిన ఈ మేకోవర్ సెషన్‌ను స్వయంగా పర్యవేక్షించారు. ఈ వీడియోలో నాని పాత్రకు సంబంధించిన ప్రత్యేకమైన యాక్సెసరీస్‌తో ప్రయోగాలు చేయడం కూడా కనిపిస్తుంది. రౌండ్ డార్క్ సన్‌గ్లాసెస్, భారీ బుట్చర్ అప్రాన్, మాంసం కోసే క్లీవర్ కత్తి వంటి ఆసక్తికరమైన అంశాలు ఇందులో ఉన్నాయి. వీటితో నాని పోషించబోయే పాత్ర ప్రపంచం ఎంత విలక్షణంగా ఉండబోతోందో అర్థమవుతోంది. ఈ సినిమాలో ఆయన చెఫ్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నారు. 

మరిన్ని వార్తలు