సందీప్ కిషన్ సరసన..

11-10-2026 | 05:25am

‘శంబాల’(Shambhala) లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్‌రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని(Director Yugandhar Muni) కలిసి మళ్లీ ఓ సినిమాను రూపొందించబోతున్నారు. సందీప్ కిషన్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న ఆ చిత్రమే ‘కరికాల’. రెండు చాప్టర్లుగా రూపుదిద్దుకోనుందీ సినిమా. మొదటి చాప్టర్ 2027 జూలై 2న, రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న విడుదల కాబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.

సోషియో ఫాంటసీ, విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సందీప్ కిషన్‌కు జోడీగా కేథరిన్ థ్రెసా నటించనుంది. ఈ మేరకు హీరోయిన్‌కు వెల్‌కమ్ చెప్తూ చిత్రయూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. సందీప్ కిషన్, కేథరిన్ థ్రెసా తెరపై మొదటి సారిగా కలిసి కనిపించబోతున్నారు.

ఇక ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా ఓ డిఫరెంట్ రోల్‌ను పోషించబోతున్నట్టుగా తెలుస్తోంది. భారతీయ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సోషియో-ఫాంటసీ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా ఈ మూవీ టీమ్ పనిచేస్తోంది. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు