చివరి వరకు ఉత్కంఠ.. 44 ఏళ్ల రికార్డ్ బ్రేక్
నగోయాలో భారత అథ్లెటిక్స్‌కు మరో చారిత్రాత్మక ఘట్టం! ఆసియా క్రీడల్లో పురుషుల మారథాన్‌లో భారత రన్నర్ సావన్ బర్వాల్(Sawan Barwal Silver) అదరగొట్టాడు. శనివారం జరిగిన ఫైనల్లో తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో రజత పతకం(Marathon Silver Medal) సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచాడు. బర్వాల్ 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. జపాన్‌కు చెందిన ఇచిటకా యమషితా 2:10:49తో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం దక్కించుకోగా.. బర్వాల్ 48 సెకన్ల తేడాతో రెండో స్థానాన్ని సాధించాడు. చైనాకు చెందిన పేయౌ ఫెంగ్ 2:12:13తో కాంస్య పతకం గెలిచాడు. ఈ రజతంతో భారత మారథాన్ చరిత్రలో బర్వాల్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు.
1982 ఢిల్లీ ఆసియా క్రీడల(Asian Games 2026) తర్వాత పురుషుల మారథాన్‌లో భారత్‌కు మళ్లీ పోడియం ఫినిష్ లభించింది. అంటే సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ విభాగంలో భారత్‌కు పతకం దక్కింది. వ్యక్తిగత బెస్ట్‌తో సావన్ బర్వాల్ సాధించిన ఈ ప్రదర్శన.. ఆసియా క్రీడల్లో భారత అథ్లెటిక్స్‌కు మరో మైలురాయిగా నిలిచింది. పురుషుల మారథాన్(Marathon Medal India) ఫైనల్లో 44 ఏళ్ల తర్వాత భారత్ తొలిసారిగా పతకం సాధించడంతో ఇండియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చివరిసారిగా 1982లో ఢిల్లీలో జరిగిన క్రీడల మెగా ఈవెంట్లో మారథాన్ పతకాన్ని గెలుచుకుంది.