ప్రతి సినిమా వ్యక్తిగతంగా నన్ను మారుస్తుంది!

11-10-2026 | 05:25am

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి‘(Ranabali Film ). ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం(directed by Rahul Sankrityan ) వహిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ నెల 16న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమై, ఈ మూవీ హైలైట్స్‌ను పంచుకున్నారు.

  1. రాజమౌళితో చేస్తే తప్ప నా సినిమాలకు టికెట్ రేట్లు పెంచబోం 
  2. ‘రణబాలి’ కథానాయకుడు విజయ్ దేవరకొండ 

‘పెళ్లి చూపులు’ తర్వాత నేను కంఫర్ట్‌గా ప్రమోషన్ చేస్తూ, రెండు మూడు సార్లు కాపీ చెక్ చేసుకుని, రిలీజ్‌కు తీసుకొస్తున్న సినిమా ఇది. మా మూవీ బ్యాక్‌డ్రాప్ లోనే చాలా సీజీ వర్క్ ఉంది. ప్రీ ప్రొడక్షన్ టైమ్‌లోనే మాకు సీజీ వర్క్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిసింది. ఫిబ్రవరి లోనే సీజీ సీన్స్ అన్నీ ఇచ్చేశాం. సెన్సార్ సర్టిఫికెట్ సోమవారం వస్తుందనుకుం టున్నాం. సర్టిఫికెట్ ఏది ఇచ్చినా ఫర్వా లేదు. ఒక్కో సినిమా ఒక్కో కారణం వల్ల చేస్తాం. ఈ సినిమా అంతే. 

చరిత్రలో మన ప్రజలకు జరిగిన అన్యా యాల గురించి తెలుసుకుంటుంటే ఇవన్నీ నిజమా, ఇంత దారుణంగా జరి గాయా అని షాక్‌కు గురవుతాం. కొంద రికి మనమంటే అసలు లెక్కే కాదు. చెట్లు పుట్టల్లా మనం కూడా వాళ్లకు ఒకటే. అంత తక్కువగా చూసేవాళ్లు. మన దేశ భవిష్యత్ గురించి మనం ఆలోచించా లంటే చరిత్ర తెలియడం ముఖ్యం. ఈ సినిమాను మేము కరెక్ట్‌గా అటెంప్ట్ చేస్తే మరిన్ని ఇలాంటి సినిమాలు వస్తాయి. మన చరిత్రలో రహస్యంగా మనకు తెలియకుండా మిగిలిపోయిన అధ్యాయా లను సినిమా మాధ్యమం ద్వారా వెలికితీసే ప్రయత్నాలు జరుగుతాయి. లేదంటే ఇంకెవరూ ఇలాంటి కథల్ని ముట్టుకోరు. అందుకే బాధ్యతగా,  జాగ్ర త్తగా ఈ సినిమా రూపొందించాం.

మన చరిత్రలో ప్రజల కోసం నిలబడిన ఎంతోమంది గొప్ప వీరులున్నారు. ఈ వీరులంతా మూడు పదుల్లోనే చనిపో యారు. వారే ‘రణబాలి’కి స్ఫూర్తి. ఆ వీరుల గొప్పదనం, మన పూర్వీకులు ఎదుర్కొన్న దారుణాలు, మనం ఒక సొసైటీగా అప్పుడు చేసిన తప్పేంటి, బ్రిటీషర్స్ ఈ విశాల దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారు.. ఇలా అన్నింటినీ ‘రణబాలి’ ద్వారా బిగ్‌స్క్రీన్‌పై చూపించ బోతున్నాం. ఈ సినిమా చూసి బయటకు వచ్చాక మన చరిత్ర, సంస్కృతి గురించి మాట్లాడుకుంటారు. 

ఇది సాఫ్ట్‌గా చెప్పే కథ కాదు, సాఫ్ట్‌గా చూపించే ప్రపంచం కాదు. మా సినిమా లో కేవలం యాక్షన్ కోసమే యాక్షన్ సీన్సులు చేయలేదు. అప్పట్లో మనుషులు చాలా మొరటుగా ఉండే వాళ్లు. ఆ స్థాయి హింసను మా సినిమాలో చూపించలేదు. సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు ఉంటుంది. ‘రణబాలి’ పాత్రలో నేను కనిపించే విధానం, మాట్లాడే విధానం అన్నీ సహజంగా ఉంటాయి.  నేను పదేళ్ల పుట్టపర్తిలో చదువుకున్నా కాబట్టి నాకు రాయలసీమ యాస కొంత తెలుసు.

ఈ సినిమా కోసం పర్పెక్ట్‌గా ఉండేలా నేర్చుకున్నా. 2 నుంచి 3 నెలల పాటు యాస, డైలాగ్స్ మీద సాధన చేశా. హార్స్ రైడింగ్ కోసం కష్ట పడ్డా.  జయమ్మగా రష్మిక పేరును డైరెక్టర్ రాహుల్ సూచించాడు. ఆమే బాగుం టుందని నాకూ అపించింది. నా గత సిని మాల్లో హీరోయిన్‌గా రష్మిక ప్రస్తావన వచ్చినా తను కరెక్ట్ కాదనిపిం చింది. ‘రణబాలి’ మేము కలిసి చేయడం వల్ల ఈ పాత్రలకు ఇంకాస్త ఎమోషనల్ డెప్త్ వచ్చింది.

ఎందుకంటే ఆ పాత్రలపై మా నిజ జీవిత ప్రభావమూ పడుతుంది. ప్రేక్షకుకూ ఇదే భావన కలుగుతుంది. ఏ సినిమా అయినా ఇది నా నిజ జీవిత పాత్ర అని అనుకునే నటిస్తా. నేను చేసే ప్రతి సినిమా వ్యక్తిగతంగా నాపై ప్రభావం చూపిస్తుంటుంది, నన్ను మారుస్తుం టుంది. ‘రణబాలి’ ప్రభావం కూడా నాపై వ్యక్తిగతంగా ఉంది.  

నా కాలేజ్ రోజుల్లో టికెట్ హైక్ వల్ల కొన్ని సినిమాలు చూడలేక బాధపడ్డా. ఒక హీరోగా నా సినిమాలకు టికెట్ ధరలు పెంచడం నాకు ఇష్టం ఉండదు. ‘రణబాలి’ నుంచి నా రాబోయే ఏ సినిమాకూ టికెట్ హైక్స్ ఉండవు. రాజమౌళితో సినిమా చేస్తే తప్ప నా సినిమాలకు టికెట్ రేట్లు పెంచబోం. రాహుల్ సాంకృత్యాన్ నాతో రాయల సీమ యాసలో సినిమా చేస్తే, రవి కిరణ్ కోలా గోదారి జిల్లా నేపథ్యంతో సినిమా చేస్తున్నాడు. వాళ్ల యాసలో నన్ను హీరోయిక్‌గా చూపిచడానికి ఆ దర్శకులు ఇష్టపడుతున్నారు. డివోషనల్‌గా ఏదైనా బయోపిక్ చేసే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా. 

మరిన్ని వార్తలు