రవితేజ తులాభారం ప్రారంభం

12-10-2026 | 05:20am

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వివేక్ ఆత్రేయ(Director Vivek Athreya) క్రేజీ కాంబినేషన్‌లో ఆర్టీ78 తెరపైకి వస్తోంది. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై(Bridge Productions banner) లక్ష్మణ్, శ్రీనిరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తునారు. ఈ సినిమా టైటిల్‌ను వెల్లడించేందుకు మేకర్స్ రూపొందించిన ‘ది టైటిల్ డాక్యుమెంటరీ’ వీడియోను మై హోమ్ రామ్ విడుదల చేశారు.

‘తులాభారం’ టైటిల్‌ను ఎంపిక చేసే ప్రక్రియ వెనుక జరిగిన సరదా, వినోదభరితమై సంభాషణలను ఈ వీడియో ద్వారా చూపించారు. జడేజాగా అనిల్ కరెళ్ల, రాబిన్‌గా రవి ఆంటోనీ, సౌండ్‌గా అనస్వర రాజన్, దేవరాజ్‌గా తరుణ్ భాస్కర్, శివాజీ రావుగా జేడీ చక్రవర్తి, కృష్ణవేణిగా ప్రియాంక మోహన్ కనిపించనున్నారు. మూవీ యూనిట్ ఆదివారం సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించింది.

ముహూర్తం సందర్భంగా వీవీ వినాయక్ మూవీటీమ్‌కు స్క్రిప్టును అందజేశారు. చందు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, శ్రీ విష్ణు క్లాప్ కొట్టారు. శివ నిర్వాణ, బాబీ కలిసి తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. తేని ఈశ్వర్ ఐఎస్సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

మరిన్ని వార్తలు