శనార్తి షూటింగ్ షురూ!

25-10-2026 | 05:15am

ఆదిత్య మూవీస్ సమర్పణలో(Presented by Aditya Movies) సంపత్ నంది టీమ్ వర్క్స్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో రాజ్ వెడ్స్ రాంబాయ్ ఫేమ్ అఖిల్ రాజ్, ఫోక్ క్వీన్ నాగదుర్గ హీరో, హీరోయిన్‌లుగా రాబోతున్న చిత్రం శనార్తి. రెగ్యులర్ షూట్ కరీంనగర్ జిల్లా వెలిచాలలో పూజ కార్యక్రమంతో ఘనంగా మొదలయింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు సంపత్ నంది, ప్రొడ్యూసర్ శ్రీధర్‌రెడ్డి, ఇతర నటీనటులు పాల్గొన్నారు.

సుమారు నెల పాటు వెలిచాల, గట్టు భూత్కూర్‌లో జరగనుంది. ఈ చిత్ర దర్శకులు గణేష్ రాజ్ ఉప్పునూటి గంగాధర మండలం, గట్టు బూత్కూర్ చెందిన వారు కావడం విశేషం. తెలంగాణ సంప్రదాయ, సాంస్కృతిక మూలాల్ని గుర్తు చేసే ఈ చిత్రం ఒక మరిచిపోలేని మైలురాయి గా నిలవనుంది.

రచయితగా, కథకుడిగా, షో రన్నర్‌గా తనకున్న ప్రతిభతో పేరుగాంచిన దర్శకుడు సంపత్ నంది ఓదెల ఫ్రాంచైజీతో సహా విజయవంతమైన కథలు, ఫ్రాంచైజీలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. శనార్తితో ఆయన అనుబంధం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతోంది. తన విలక్షణమైన సంగీతంతో ప్రశంసలు పొందిన సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతపరంగా మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వనాథ్ రెడ్డి డీవోపీ, బేబీ సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్.


మరిన్ని వార్తలు