రీ ఎంట్రీ క్రెడిట్ ఫ్యామిలీదే
- ఐపీఎల్ నన్ను మార్చింది
- భువనేశ్వర్ వ్యాఖ్యలు
క్రైస్ట్‌చర్చ్, అక్టోబర్ 24 : దాదాపు నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కు మార్(Bhuvneshwar Kumar) ప్రస్తుతం న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్ ఆడుతున్నాడు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించడంతో భువీకి సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తన రీఎంట్రీకి సంబంధించి కీల క విషయాలను బీసీసీ ఐకి ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించాడు.
ఈ క్రెడిట్ అంతా తన కుటుంబానికే చెందుతుందన్నాడు. రీ ఎంట్రీ గురించి ఎప్పుడూ మా ట్లాడుకోలేదని, తన పని తాను చేసుకుంటూ వెళ్లానని వ్యాఖ్యానించాడు. ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుందన్నాడు. నాలుగేళ్లుగా ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిం చలేదని భువీ స్పష్టం చేశాడు.