అమెరికాలో ‘రాయవలస’ పాట
రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపికృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’(Maa Ooru Rayavalasa) చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కార్తీక్ జయంతి, శ్రీష హీరో హీరోయిన్లుగా నటించగా, ప్రముఖ నటులు అనితా చౌదరి, రవివర్మ, జయప్రకాష్, కాశీ విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘మా ఊరు రాయవలస’ పాటను విడుదల చేశారు.
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘నాటు నాటు’ పాటను ఆలపించిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడటం మరో విశేషం. ఈ పాటను రిలీజ్ చేసిన అనంతరం విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘రాయవలస’ కంటెంట్ బాగుంది. సాంగ్ గొప్పగా ఉంది. రాహుల్ అద్భుతంగా పాడాడు. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు. ఆంధ్రా పల్లెటూరి జానపద పాట న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వరకు చేరుకుంది.
డెబ్యూ హీరో, డెబ్యూ డైరెక్టర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పిస్తూ, అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్స్‌పై ‘రింగుడు రింగుడు’ పాట విజువల్స్‌ను ప్రదర్శించడం విశేషంగా నిలిచింది. అర్జున్ బాల సంగీతం అందించగా, రాఖీ కథను అందించారు. డిసెంబర్ 11న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.