నిరుపేద కుటుంబానికి పద్మశాలి సేవ సంస్థన్ ఆర్థిక చేయూత
రూ.5 వేల నగదు, 25 కిలోల బియ్యం పంపిణీ
వేములవాడ, అక్టోబర్ 11, (విజయక్రాంతి): నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తూ వేములవాడ పద్మశాలి సేవ సంస్థన్(Vemulawada Padmasali Seva Sansthan) సభ్యులు మానవతా దృక్పథంతో సహాయం అందించారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన జిందం లక్ష్మి(Jindam Lakshmi), ఆమె భర్త రాజేశం కుటుంబానికి రూ.5 వేల నగదుతో పాటు 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు(Financial difficulties) ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడమే సంస్థ లక్ష్యమని తెలిపారు. అవసరంలో ఉన్నవారికి తమ వంతు సహాయం అందించేందుకు పద్మశాలి సేవ సంస్థన్ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు గేంట్యాల రమేష్, వ్యవస్థాపకుడు మద్దిరాల నరేష్, యేముల శ్రీనివాస్, బిల్లా కృష్ణ, ప్రధాన కార్యదర్శి తడిగొప్పుల బాలరాజు, కోశాధికారి వేముల గంగాధర్, ప్రచార కార్యదర్శి చిలుక దేవదాస్, కార్యవర్గ సభ్యులు కొడం శ్రీనివాస్, అంజయ్య, చిలుక ప్రభాకర్, కొడం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.