దళితులపై దాడులను సహించేది లేదు

21-10-2026 | 07:52pm
  1. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
  2. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు

వెంకటాపూర్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): మండలంలో దళితులపై(Dalits') జరుగుతున్న దాడులు, వివక్ష ఘటనలను బీఆర్‌ఎస్(BRS) జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు(Kakulamarri Lakshman Babu) తీవ్రంగా ఖండించారు. ఇటీవల నర్సింగాపూర్ గ్రామ సర్పంచ్‌ పై, రామాంజపూర్ గ్రామానికి చెందిన జైలు పోతుల సుధాకర్‌పై జరిగిన దాడుల ఘటనలపై(Incident of attacks) ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల ప్రాణాలకు, ఆత్మగౌరవానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, గౌరవం, భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని లక్ష్మణ్ బాబు అన్నారు. మంత్రి సీతక్క(Seetakka) ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని పేర్కొంటూ, బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగకుండా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. వెంకటాపూర్ మండలంలో దళితులపై దాడులు పునరావృతం కాకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు. దళితులపై దాడులు ఆగకపోతే బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేపడతామని లక్ష్మణ్ బాబు హెచ్చరించారు. మంత్రి సీతక్క ఈ ఘటనలపై స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. దళితుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు