ఘనంగా కొమరం భీం వర్ధంతి వేడుకలు
ములుగు జిల్లాకు మంజూరైన కోర్టును ఎటునాగారంలో ఏర్పాటు చేయాలి: తుడుం దెబ్బ
వాజేడు (విజయక్రాంతి); తుడుం దెబ్బ వాజేడు మండల(Wajedu Mandal) కమిటీ ఆధ్వర్యంలో కొమరం భీమ్ 86వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేగ గణేష్ మాట్లాడుతూ ఏటూరునాగారంలో కోర్టు నిర్మాణం చేపట్టాలన్నారు కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల ప్రజలకు సుమారు 30 కిలోమీటర్ల పరిధిలోనే కోర్టు సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలు న్యాయ సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా, ప్రయాణ ఖర్చులు మరియు ఆర్థిక భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. పేదలు, వృద్ధులు, మహిళలు, గిరిజన ప్రజల అవసరాలు ఆ దృష్టిలో ఉంచుకొని గిరిజన ప్రాంతాల ప్రజల ఆర్థిక పరిస్థితులను గమనించవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయంలో ఈ ప్రాంత మంత్రి చొరవ చూపాలని, కోర్టును ఏటూరు నాగారంలో నిర్మించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. జల్ జంగిల్ జమీన్(నీరు అడవి భూమి)కోసం ఉద్యమించి సాధించిన గిరిజన చట్టాలు, హక్కులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పూర్తిస్థాయిలో ఉండడం లేదని మండిపడ్డారు.
ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు రావలసిన ఉద్యోగాలు పక్కదారి పడుతున్నాయని అన్నారు. కొమరం భీం చూపించిన పోరాట మార్గంలోనే యువత నడవాలని కోరారు. అందుకు ప్రతి గ్రామంలోని యువకులతో గ్రామ కమిటీలు వేయాలని తుడుం దెబ్బ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం చంటి, ఉపాధ్యక్షులు పద్దం సుధాకర్,జిల్లా కార్యదర్శి ఎట్టి చంద్రశేఖర్ , మండల అధ్యక్షులు అట్టం శివ కృష్ణ, ASU అధ్యక్షులు, గొంది మోరళీకృష్ణ, ఉపాధ్యక్షులు అట్టం సంపత్ కుమార్,ప్రధాన కార్యదర్శి మోడెం సందీప్, వర్కింగ్ ప్రసిడెంట్ ఆలం సురేష్, ఉపాధ్యక్షులు గొంది యోగేశ్వరావు,కార్యదర్శి గొంది మల్లిఖానరావు, ఆదివాసీ సీనియర్ నాయకులు బొద్దెబోయిన సురేష్, పోడెం సంతోష్, తదితరులు పాల్గొన్నారు