కొమరం భీమ్ 86వ వర్ధంతి

26-10-2026 | 05:07pm

ఆదివాసీల రాజ్యాంగబద్ధమైన హక్కులను అమలు చేయాలని డిమాండ్

వెంకటాపురం/నూగూరు (విజయక్రాంతి): వెంకటాపురం మండల కేంద్రంలో సోమవారం కొమరం భీమ్ 86వ వర్ధంతి(Komaram Bheem Death Anniversary) పురస్కరించుకొని తుడుం దెబ్బ, తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో గ్రామ పెద్దలైన వాసం లక్ష్మయ్య  గొంది శేషగిరి జజ్జరి నారాయణమ్మ పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు  అర్పించారు.

తర్వాత ఆదివాసి సంఘ నాయకులు పూనెం రామచందర్రావు తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేగ గణేష్ తుడుం దెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పూనెం చంటి తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చింత సోమరాజు తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. జల్ జంగిల్ జమీన్ నినాదంతో ఆదివాసి హక్కుల కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన మహనీయులు కొమరం భీమ్ అని ఆయన యొక్క సేవలను ఆదివాసి  జాతి స్మరించుకోవాలి అలాగే ఆయన యొక్క పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని ఆదివాసి యువత ఉద్యమించాలని వారు కోరారు ఏజెన్సీ ప్రాంతంలో 1/59 1/70 చట్టాలను మరియు పీసా చట్టాలను పటిష్టంగా అమలు చేయడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందారని వారు విమర్శించారు.

ఇప్పటికైనా రాజ్యాంగబద్ధంగా ఆదివాసులకు కల్పించినటువంటి హక్కులను చట్టాలను ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో కొమరం భీమ్ వారసత్వాన్ని ఆదర్శంగా తీసుకొని పాలక ప్రభుత్వాలపై ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ఈ  కార్యక్రమంలో తెలంగాణ భూమి పుత్ర ఆదివాసి సంఘం మండల కమిటీ  ఉండం రామచంద్ర ప్రసాద్, తుడుం దెబ్బ మండల అధ్యక్షులు పూణెం శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి ఎలకం సాగర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మిచ్చ సురేష్, ఆదివాసి విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి పాయం శశికుమార్, జిల్లా కార్యదర్శి పాయం కృష్ణ, పొడెం సురేష్, మడకం సంజయ్, తురుషరాజు, పూనమ్ సాయి, చరణ్, కోరం ప్రసాద్, మొర్రం జానకరావు, మనుబోతుల సురేష్, పంది మనోజ్, సురటి సిద్దు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు