ఉచిత మెడికల్ క్యాంప్

01-10-2026 | 07:09pm

వెంకటాపురం,(విజయ క్రాంతి): మండలంలోని ఇప్పలగూడెం గ్రామం(Ippalagudem Village)లో కాఫెడ్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో డైరెక్టర్ లూర్థు రాజు ఆదేశాల మేరకు గురువారం మెడికల్ క్యాంప్(Medical Camp) నిర్వహించారు. ఈ సందర్భంగా ఎదిర డాక్టర్ పవన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన వైద్య సలహాలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు. మెడికల్ కిట్(Medical kit)లో ఉన్న టాబ్లెట్స్ గురించి డాక్టర్  వివరించటం జరిగింది. 90 కుటుంబాలకు మెడికల్ కిట్స్ పంపిణీ చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో హెచ్.ఈ.ఒ  కోటిరెడ్డి సర్పంచ్ సుశీల, ఉప సర్పంచ్ శంకర్, ఆశ వర్కర్ లువెంకటాపురం మండల కోఆర్డినేటర్ జి హనుమంత్ వాజేడు మండల కోఆర్డినేటర్ జి కామేష్ యానిమేటర్స్ ఉషా, ఇందిరా, పద్మ, ప్రశాంత్, నరేశ్, సుజల గ్రామస్థులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు