దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు

21-10-2026 | 07:48pm

వెంకటాపూర్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): మండలంలోని రామాంజపూర్ గ్రామంలో(Ramanjapur Village) విజన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి సీతక్క(Seetakka) హాజరై ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు(Special prayers) నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో(devotional) నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో మంత్రి పాల్గొనడంతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తిపారవశ్యంతో నిండిపోయాయి.

మరిన్ని వార్తలు