అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు
18-10-2026 | 07:24pm
ములుగు అక్టోబర్ 18 (విజయక్రాంతి) : జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు(Saddula Bathukamma Celebrations) ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఆడపడుచులు బతుకమ్మలను రంగురంగుల పూలతో పేర్చేందుకు పోటీలు పడ్డారు. జిల్లావ్యాప్తంగా పలు గ్రామపంచాయతీలు(Village Panchayat) బతుకమ్మ వేడుకలకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాయి. బతుకమ్మ ఆటపాటలతో నైవేద్యాలు పంచుకుంటూ బతుకమ్మ సంబరాల్లో మహిళలు పాల్గొన్నారు.