చిల్లేపల్లి పీఏసీఎస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
చైర్మన్గా కట్టా.రామారావు బాధ్యతల స్వీకరణ
నేరేడుచర్ల,నవంబర్ 12(విజయ క్రాంతి): మండలంలోని చిల్లేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Primary Agricultural Cooperative Society) (పీఏసీఎస్) నూతన పాలకవర్గం గురువారం నాడు పదవీ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించింది.
సంఘం చైర్మన్గా కట్టా రామారావుతో పాటు 12 మంది పాలకవర్గ సభ్యులు కేతిరెడ్డి నర్సిరెడ్డి,వనం రామకోటయ్య, అనంతుల రేణుక, గజగంటి ప్రవీణ్, కారింగుల సుజాత,దోరేపల్లి లింగమ్మ,ఘంటా రాఘవరెడ్డి, దిండిగాల కిరణ్,మాలోతు సైదా,నన్నేపంగు ఏడుకొండలు, బండ్ల నాగేశ్వరరావు,పల్లె లింగయ్య ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం చైర్మన్ కట్టా రామారావు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ,సహకార సంఘం ద్వారా రైతులకు అవసరమైన సేవలు, సదుపాయాలను అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు పాలకవర్గ సభ్యులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు.
సంఘం అభివృద్ధితో పాటు రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ అందరి సహకారంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.తన ఎన్నికకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన పాలకవర్గానికి పలువురు ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొనతం చిన్న వెంకట్ రెడ్డి,వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి,పీఏసీఎస్ సీఈఓ నాగరాజు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, నూతన పాలకవర్గ సభ్యులు, కార్యాలయ సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.