5వ బెటాలియన్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం..
గోవిందరావుపేట (విజయక్రాంతి): పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 5వ బెటాలియన్ టీజీఎస్పీ, చల్వాయిలో అదనపు కమాండెంట్ టి. కాలిదాస్(Additional Commandant T. Kalidas) ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు.
దేశ అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అందిస్తున్న సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు అసిస్టెంట్ కమాండెంట్ అరుణ్ రాజ్ కుమార్, ఆర్ ఐ లు వెంకటేశ్వర్లు సాయిబాబు , సిబ్బంది పాల్గొని పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.