ప్రతి పల్లెలో వాడబలిజ జెండా

19-11-2026 | 11:13am

ములుగు జిల్లా, వెంకటాపురం (నూగూరు), నవంబర్ 19 (విజయక్రాంతి): ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం (World Fisheries Day) సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని వాడబలిజలందరూ ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం అధ్యక్షుడు డర్రా దామోదర్ పిలుపునిచ్చారు. నవంబర్ 21న నిర్వహించనున్న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రతి మండలం, గ్రామం, పల్లెల్లో వాడబలిజలందరూ సంఘం జెండాను ఆవిష్కరించాలని కోరారు. మత్స్యకారులందరూ ఐక్యంగా ముందుకు సాగాలని, తమ ఐక్యతను చాటిచెప్పేలా కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.

వాడబలిజల ఐక్యతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం పిలుపునిస్తోందని డర్రా దామోదర్ తెలిపారు

మరిన్ని వార్తలు