చెరువు తూముని ఇరగ్గొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

28-10-2026 | 11:25am

వెంకటాపురం నూగూరు అక్టోబర్ 28 విజయక్రాంతి : వెంకటాపురం మండల(Venkatapuram Mandal) పరిధిలో బుధవారం ముకునూరు పాలెం గ్రామ శివారులో  ఉన్న ఊరు చెరువు తూముని(Tank Sluice) ఇరగ్గొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. అసలే ఎలినో ప్రభావంతో(El Nino effect) పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు(Farmers) ఇబ్బంది పడుతుంటే కొందరు వ్యక్తులు, అదేపనిగా గ్రామాల చివర్లో ఉన్న ఊరు చెరువు  తూములను నాశనం చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులు చర్య తీసుకోవాలని రైతులు కోరుతున్నారు

మరిన్ని వార్తలు