మంత్రి జూపల్లి విదేశాలు వెళ్లి జల్సాలు చేస్తుండు
కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కేంద్రంలోని శుక్రవారం రైతుల సమస్య పరిష్కరించాలని చలో కొల్లాపూర్ కార్యక్రమం ద్వారా బిజెపి కార్యాలయం రైతులతో ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టగా అధికారులు ఎవరు స్పందించకపోవడంతో నిరాహార దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఏల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ.పంటలకు. సాగునీరు లేక సరిపడ కరెంటు లేక పంటలు ఎండిపోతుంటే. మంత్రి జూపల్లి కృష్ణారావు విదేశాలకు వెళ్లి జల్సాలు చేస్తున్నాడని వారు ఆరోపించారు.
తక్షణమే పంటలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం 20.000 రూపాయలు అందజేయాలని అధికారుల నుంచి ఏదో ఒక స్పందన రావాలని కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడిస్తే ధర్నా ఆపేస్తా లేదంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని రైతుల ముందే సుధాకర్ రావు పోలీసు అధికారులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మంత్రి సొంత గ్రామం పెద్ద దగడలో లో 130 కె వి సబ్ స్టేషన్ లో 131 పాయింట్స్ ఎంఏలు ట్రాన్స్ఫర్లు ఉన్నాయని దానికి లోడ్ 4క్యా చేసి రెండు సంవత్సరాల ఏటి ఎంఏలు అడ్మినిస్ట్రేషన్ అప్రోలై రెండు సంవత్సరాలు అయితుంది.
మంత్రి జూపల్లి సిగ్గు లేకుండా ఒక్కసారి రివ్యూ చేయకుండా అట్లనే పెట్టిన కారణంగా మూడు మండలాలకు నుంచి మూడు గంటలు ఎల్ ఆర్ లోడ్ లిఫ్ట్ చేస్తుందని కనపడుతుందని కొల్లాపూర్ లో సరిపడా కరెంటు లేదని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా మాజీ జిల్లా అధ్యక్షులు మూలే భరత్ చంద్ర. రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ సందు రమేష్. బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గార శ్రీధర్ రెడ్డి. ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్ కొల్లాపూర్ మండలం అధ్యక్షుడు కేతూరి నారాయణ. బిజెపి నాయకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.