పిడుగుపాటు బాధితురాలికి అందని సాయం

28-09-2026 | 02:23pm

ఆదుకోవాలని ప్రజావాణిలో ఫులిబాయి వినతి

నాగల్‌గిద్ద, సెప్టెంబరు 28 (విజయ క్రాంతి): పిడుగుపాటుతో తీవ్రంగా గాయపడి, మూగజీవాలను కోల్పోయినా ఇప్పటికీ తగిన సాయం అందలేదని నాగల్‌గిద్ద(Nagalgidda) మండలం కరస్‌గుత్తి గోవిందా తండాకు చెందిన ఫులిబాయి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసి, తనకు ఆర్థిక సహాయం అందించాలని అధికారులను కోరారు.

2025 మార్చిలో ఉట్‌పల్లి గ్రామంలోని వ్యవసాయ పొలంలో పిడుగుపడటంతో తాను తీవ్రంగా గాయపడగా, తనకు చెందిన ఒక బర్రె, ఒక మేక, ఒక గొర్రె మృతి చెందినట్లు వివరించారు. అప్పట్లో కరస్‌గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటన జరిగి ఏడాదిన్నర గడిచినా తగిన సాయం అందలేదని వాపోయారు. తన పరిస్థితిని పరిశీలించి ఆర్థిక సహాయంతోపాటు పశునష్ట పరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు