శ్రీశైలంలో సీన్ మారింది
శ్రీశైలం జలాశయానికి స్వల్ప వరద.. కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి(Srisailam Dam) స్వల్పంగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2,498 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 23,826 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం(Srisailam water level) 854.90 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టులోకి వస్తున్న నీటి కంటే బయటకు విడుదలవుతున్న నీటి పరిమాణం ఎక్కువగా ఉంది. మరోవైపు శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి ప్రవాహాలు, ఔట్‌ఫ్లో పరిస్థితిపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇన్‌ఫ్లో స్వల్పంగానే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఔట్‌ఫ్లో భారీగా ఉండటంతో శ్రీశైలం జలాశయ పరిస్థితి ఆసక్తికరంగా మారింది.