ఇందిరమ్మ మోడల్ హౌస్ పూర్తి చేయాలి

28-09-2026 | 03:02pm

ఏడాది దాటినా పూర్తికాని నిర్మాణంపై ప్రజావాణిలో ఫిర్యాదు

హౌసింగ్ ఏఈ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని వినతి

నాగలిగిద్ద, సెప్టెంబర్‌ 28 (విజయ క్రాంతి): నాగలిగిద్ద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ(MPDO Office) ఆవరణలో చేపట్టిన ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం ఏడాది దాటినా పూర్తి కాకపోవడంపై కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గణపతి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మోడల్ హౌస్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, సంబంధిత మండల హౌసింగ్ ఏఈ పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపిస్తూ సంబంధిత అధికారులకు లిఖితపూర్వక వినతిపత్రం అందజేశారు.

ఇవి కూడా చదవండి: ఇందిరమ్మ ఇల్లు కావాలంటే.. ఖర్చు పెట్టాల్సిందేనా?

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మోడల్ హౌస్‌ను చూసి, నిర్మాణ విధానం, గదుల నమూనా తదితర అంశాలపై అవగాహన పొందేందుకు ప్రభుత్వం మండల కేంద్రంలో మోడల్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టిందని గణపతి ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నిర్మాణం ప్రారంభించి ఏడాది దాటినా పనులు పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదని తెలిపారు.

ఇవి కూడా చదవండి: ఇందిరమ్మ బీమా వారికి మాత్రమే

పనులు త్వరగా పూర్తి చేస్తామని గతంలో అధికారులు చెప్పినప్పటికీ ఇప్పటికీ నిర్మాణం అసంపూర్తిగానే ఉందని పేర్కొన్నారు.మోడల్ హౌస్ నిర్మాణం ఎందుకు ఆలస్యమవుతోందో విచారణ జరిపించాలని, పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించినట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని గణపతి ప్రజావాణిలో కోరారు. అలాగే పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను వెంటనే చేపట్టి, నిర్ణీత గడువులో పూర్తి చేసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మోడల్ హౌస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి: దసరా వేళ.. ఇందిరమ్మ ఇండ్లు

మరిన్ని వార్తలు