విద్యా పథకాలను వినియోగించుకొని రాణించాలి

11-10-2026 | 08:12pm

 - జిల్లా జి సి డి ఓ శోభారాణి

వెల్దండ అక్టోబర్ 11:  వెల్దండ మండల కేంద్రంలో ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో(Kasturba Gandhi Balika Vidyalaya) వందేమాతరం, ఐక్యత ఫౌండేషన్, శృతిలయ కల్చరల్ అకాడ మీ, మై విలేజ్ మోడల్ విలేజ్(My Village Model Village) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దసరా సాంస్కృతిక శిక్షణ శిబిరాన్ని(Dasara Cultural Training Camp) ఆదివారం అభయ ప్రారంభించారు ఈ సందర్భంగా జి సి డి ఓ సంధ్యారాణి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో ఎంతోమంది ప్రతిభావంతులు కళాకారులు ఉన్నారని వారందరిని వెలికి తీయడానికి ఇలాంటి శిక్షణ శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె అన్నారు.

ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలన్నారు. శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు వారికి సహకరిస్తున్న వారికి ఆమె అభినందనలు తెలిపారు కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యుడు వరప్రసాద్ రెడ్డి, కల్చరల్ అకాడమీ కార్యదర్శి చిత్తరంజన్, నిర్వాహకులు విజయ్ కుమార్, శ్రీరామ్, రవళి, జ్యోతి, రవికాంత్, మల్లేష్, వసంత, పల్లవి తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు