ఘనంగా ఐలమ్మ 131 వ జయంతి
26-09-2026 | 11:02pm
వెల్దండ సెప్టెంబర్ 26): వెల్దండ మండల(Veldanda Mandal) కేంద్రంలో శనివారం వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ilamma) 131 వ జయంతిని రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు కార్యక్రమంలో రజక సంఘం(Rajaka Association) అధ్యక్షుడు రేవల్లి రవి, రమేష్, వివిధ పార్టీల నాయకులు భూపతి రెడ్డి, కృష్ణ యాదవ్, తంబాలు, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.