బీరం లక్ష్మారెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్

27-09-2026 | 04:59pm

కొల్లాపూర్ సెప్టెంబర్ 27: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కేంద్రంలోని సింగోటం గ్రామంలోని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. బీరం లక్ష్మారెడ్డి దిశదినకర్మ కార్యక్రమం ఆదివారం సింగోటం తమ వ్యవసాయ పొలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party State Working President KTR) హాజరై లక్ష్మారెడ్డి చిత్రపటానికి  పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, ఆలా వెంకటేశ్వర్ రెడ్డిలు లక్ష్మారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు.

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లక్ష్మారెడ్డి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డికి తాను అండగా ఉంటానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. తనతో పాటు బీఆర్ఎస్ పార్టీ మొత్తం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు.బీరం లక్ష్మారెడ్డి దశదిన కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు