అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీసీలపై అణిచివేత

16-10-2026 | 03:28pm

వేధింపులు ఆపకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తాం

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి):  అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన బీసీ నాయకులపై ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్‌ యాదవ్‌(BRS State Secretary Baikani Srinivas Yadav) ఆరోపించారు. అక్రమ కేసులో అరెస్టయిన మాజీ జడ్పీటీసీ శ్రీశైలంను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మక్కల కొనుగోళ్లలో అవినీతిని ప్రశ్నించినందుకే శ్రీశైలంపై కేసు పెట్టారని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై నెల రోజుల్లో చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చి ఐదు నెలలైనా స్పందన లేదని విమర్శించారు. బీసీలపై వేధింపులు ఆపకుంటే గొల్ల, కురుమలతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, వేలాది మంది బీసీలతో పోలీస్‌స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు