నిర్ణీత గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలి

07-10-2026 | 02:47pm

బోథ్. అక్టోబర్ 7 (విజయక్రాంతి ): నిర్ణీత గడువులోగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి మంద మకరంద(Electoral Registration Officer Manda Makaranda) కోరారు బుధవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో రాజకీయ పక్షాల ప్రతినిధులతో పాటు వివిధ మండలాల తాసిల్దారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ 2026 ప్రక్రియ ఓటర్జాబితా సవరణ అర్హులైన ఓటర్ల నమోదు తోపాటు అనరులైన వారి పేర్లను తొలగించాలని సూచించారు అంతేగాక అభ్యంతరాలు దావాల స్వీకరణను చేపట్టాలన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరిగే విధంగా రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.

అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో పలు మండలాల తాసిల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారుల విధులు ఇంటింటి సర్వే ఓటర్ల వివరాల పరిశీలన అభ్యంతరాల పరిష్కారం పైన సమీక్షించడం జరిగింది. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడంతో పాటు ఓటర్ల జాబితాలో వివరాలు పరిశీలించుకోవాలని సూచించారు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో పలు మండలాల తహసీల్దారులతోపాటు రాజకీయ పక్షాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు