కరీంనగర్ కాంగ్రెస్ నాయకులతో మర్యాదపూర్వక భేటీ

02-11-2026 | 07:00pm

కరీంనగర్ సిటీ నవంబర్ 02 (విజయక్రాంతి): ఢిల్లీలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ను(PCC President Mahesh Kumar Goud) కరీంనగర్ అర్బన్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన రాహుల్ గాంధీ సభ(Rahul Gandhi's meeting) విజయవంతం కావడంపై చర్చించారు. 

కరీంనగర్ జిల్లా నుంచి బస్సులో 36 మంది, విమానంలో 24 మంది, రైలులో 10 మంది కలిపి మొత్తం 70 మంది సభకు హాజరైనట్లు వివరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులను భారీగా సమీకరించిన తీరును పీసీసీ అధ్యక్షుడికి వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పర్వతం మల్లేశం, వరాల నర్సింగం, కాంతల జగన్ రెడ్డి, 17వ డివిజన్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, సీనియర్ నాయకులు కంకణాల అనిల్, ఇమ్రాన్ మహాత్, పెంట శేఖర్, ఇమ్రాన్ గని, ఆసిఫ్, శ్రీకాంత్, గట్టు ప్రసాద్, గుర్రి మురళి, జారిపోతుల వాసు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు